Site icon NTV Telugu

Junior Panchayat Secretaries: జేపీఎస్‌ ల కీలక నిర్ణయం.. తదుపరి కార్యచరణకు సిద్ధం

Junior Panchayat Secretaries

Junior Panchayat Secretaries

Junior Panchayat Secretaries: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘం నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మె విరమించినట్లు ప్రకటించారు. వెంటనే విధుల్లో చేరతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై సానుకూలంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలపడంతో సమ్మె విరమిస్తున్నట్లు జేపీఎస్ నేతలు ప్రకటించారు. దీంతో జేపీఎస్ సమ్మెకు పుల్ స్టాప్ పడింది. అయితే నేటి నుంచి జేపీఎస్ లు విధులకు హాజరు కావడంతో ప్రశాంతత నెలకొంది.

తమను రెగ్యులరైజ్ చేయాలని 16 రోజుల పాటు సమ్మె చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘం నేతలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమ్మె చేస్తున్న జేపీఎస్ లకు ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. సమ్మె విరమించి ఇవాల మధ్నాహ్నం 12 లోపు విధులకు హాజరు కాకుంటే తమ పేర్లను లిస్ట్‌ లేనట్టే అని హెచ్చరించింది. సమ్మె చేస్తున్న పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదని తేల్చి చెప్పింది. ఇవాల మధ్యాహ్నం 12 గంటల లోపు డ్యూటీలో ఉన్నవారి లిస్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించింది. డ్యూటీలో లేనివారు ఉద్యోగులు కారంటూ ప్రకటించింది. 12 గంటల లోపు డ్యూటీలో లేని వారిని గుర్తించి, ఆయా గ్రామాలను గుర్తించి.. లిస్ట్ డిపిఓలకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ పంచాయతీలలో గ్రామ సభ పెట్టి డిగ్రీ చదివిన వారిని తాత్కాలికంగా పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ లుగా నియామకం చేయాలని వెల్లడించింది. గతంలో పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, లేదా రిజర్వేషన్ ప్రాతిపదికన నియమించాలని సూచించింది. సమ్మె విరమించి వస్తే డ్యూటీలో జాయిన్ కావచ్చని పేర్కొంది. లేదంటే ఇప్పటికి వారి టర్మ్ ముగిసింది కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రభుత్వంతో సంబంధం లేదని పేర్కొంది. పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని వివరించింది. అయితే జేపీఎస్ లకు లాస్ట్ గా ఒక్క ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి జేపీఎస్ లు మధ్యాహ్నం 12 లోపు విధులకు హాజరవుతారా? సమ్మె కొనసాగిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో జేపీఎస్‌ లు విధుల్లో చేరుతామని ప్రకటించారు. దీంతో జేపీఎస్‌ ల సమ్మెకు పుల్‌ స్టాప్‌ పడింది.
Hanuman jayanthi: తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు.. ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి

Exit mobile version