NTV Telugu Site icon

Jr. Doctors Protest : జూడాలు మీ సమ్మె ఎవరి ప్రయోజనం కోసం?

Jr Doctors Protest

Jr Doctors Protest

వైద్యుడు కనిపించే దేవుడు.. సేవా భావం కలిగినవారే ఈ వృత్తి లోకి వస్తారు. నిస్సహాయులకు.. నిరుపేదలకు నేరుగా సాయం అందించే ఏకైక అవకాశం ఈ వృత్తిలోనే ఉంటుంది. ఈ వృత్తి మరే వృత్తికి సాటిరాదు. వైద్య శాఖకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏ సమస్య వచ్చినా అన్నిటినీ పక్కన పెట్టి ముందుగా స్పందిస్తోంది. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది. వాటన్నిటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే వైద్య విద్య సంచాల కుడి (DME) పరిధిలో పనిచేసే సిబ్బంది వేతనాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఏడాది మొత్తానికి సరిపడా రూ. 406 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి అనుమతి వేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం పదేళ్ల చరిత్రలో ఇంత ఎక్కువ మొత్తం బడ్జెట్ ను ఏ ఆర్థిక సంవత్సరంలో ను కేటాయించలేదు. వైద్య విద్యకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వారం క్రితమే సమావేశమై సమిష్టి నిర్ణయం తీసుకోగా ఆ మేరకు ఈనెల 23న అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. పేద ప్రజలకు వైద్య సేవలు అందించే వైద్య విద్య సిబ్బంది.. వేతనాలకు సంబంధించి మానసిక ఒత్తిడికి గురి కాకూడదు అన్న ప్రధాన ఆలోచన ఏ ప్రభుత్వానిది. స్వేచ్ఛగా వారి విధులు నిర్వర్తించి మెరుగైన సేవలు రాబట్టుకునే ఆలోచనతో ప్రభుత్వం ఏడాది సరిపడా నిధులు ముందే విడుదల చేసింది.

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులతో గౌరవ వేతనం, ఉపకార వేతనం పొందుతున్న వారితోపాటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, మెడికల్ టీచింగ్ స్టాఫ్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి పెద్ద ఉపశమనం కలిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఈనాడు ఇంతటి సాహస నిర్ణయం తీసుకోలేదు. ఏడాదికి సరిపడా నిధులు ముందే విడుదల చేస్తే జూనియర్ డాక్టర్లు మాత్రం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల ఉపకార వేతనాలు చెల్లించాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె పేరిట రోడ్ల మీదికి రావడం ఏ సేవా భావానికి, ఏ సామాజిక స్పృహకు దారితీస్తుందో జూనియర్ డాక్టర్ లతోపాటు పౌర సమాజం అర్థం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా అధికారిక ఉత్తర్వులు జారీ చేయడమే కాదు ఇతర సమస్యల పైన శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో జూడాల ప్రతినిధులతో సమావేశమై వారి డిమాండ్లపై చర్చిస్తున్నారు. అయినా పేదల అనారోగ్య సమస్యలు తమకేమీ పట్టవంటూ జూనియర్ డాక్టర్లు బెదిరింపులకు దిగడాన్ని సభ్య సమాజం ఏమాత్రం హర్షించడం లేదు. జూనియర్ డాక్టర్ల కంటే ముందే ప్రభుత్వం చొరవ చూపి వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న డ్యూటీలు వద్దు.. మాకు సమ్మెనేము వద్దు అంటూ జూనియర్ డాక్టర్లు మొండికి పోవడం సరైనది కాదు. సమస్యలు తీరుస్తున్న… సమ్మెలు ఉధృతం అంటూ నినదిస్తున్నారు అంటే… అదృశ్య రాజకీయ శక్తుల హస్తం ఉందని బయట విస్తృత ప్రచారం జరుగుతోంది. పేద ప్రజల ఆరోగ్యం ప్రధానమా?.. ఆందోళనలే మీ అజెండా నా.. జూనియర్ డాక్టర్లు ఆలోచన చేయండి.