తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగారు తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు.. అయితే, జూడాల డిమాండ్లు పరిష్కరిస్తామని.. కరోనా విపత్కార పరిస్థితుల్లో సమ్మెలు సరికాదని.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సూచించారు.. వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. సమ్మెకు దిగిన జూడాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతూ వచ్చింది.. డీఎంఈ రమేష్ రెడ్డి,, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.. నిన్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్ని ఈ రోజు జూడాల డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.. అయితే, రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని జూడాలు పట్టుబడుతున్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో.. సమ్మె విరమించే ఆలోచనలో జూడాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇవాళ సాయంత్రం సమావేశం కానున్న జూనియర్ డాక్టర్లు.. సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోనున్నారు..
సమ్మె విరమణపై జూడాల సమాలోచనలు..!
ju doctors