NTV Telugu Site icon

ప్ర‌భుత్వంతో జూడాల చ‌ర్ఛ‌లు విఫ‌లం..!

Junior Doctors 2

త‌మ డిమాండ్ల సాధ‌న కోసం స‌మ్మె బాట ప‌ట్టారు జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. ప్ర‌భుత్వం నుంచి స‌రైన స్పంద‌న లేద‌ని.. రేప‌టి నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను కూడా బ‌హిష్క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.. అయితే, జూడాల‌తో ప్ర‌భుత్వం త‌ర‌పున చ‌ర్చ‌లు జ‌రిపారు తెలంగాణ డీఎంఈ ర‌మేష్ రెడ్డి… ఈ చ‌ర్చ‌లు విఫ‌లం అయిన‌ట్టుగా తెలుస్తోంది.. ప్ర‌భుత్వం నుంచి స‌రైన హామీ రాలేద‌ని చెబుతున్నారు జూనియ‌ర్ డాక్ట‌ర్ల ప్ర‌తినిధులు.. రాత‌పూర్వ‌కంగా హామీ ఇస్తేనే విధుల్లోకి చేర‌తామ‌ని చెప్పామ‌ని.. కానీ, ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేద‌న్నారు.. మ‌రోవైపు.. విధుల్లో పాల్గొనే విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

క‌రోనాతో చ‌నిపోతే ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌లేమ‌ని డీఎంఈ చెప్పార‌ని తెలిపారు జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. 10 శాతం కోవిడ్ ఇన్సెంటివ్‌లు ఇవ్వ‌డం కూడా డీఎంఈ కుద‌ర‌ద‌న్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. అయితే, జ‌న‌వ‌రి 1 నుంచి లేదా ఈ నెల నుంచే 15 శాతం పే హైక్ ఇస్తామ‌ని తెలిపార‌ని.. అయితే, రాత‌పూర్వ‌కంగా హామీ ఇస్తేనే విధుల్లో చేర‌తామ‌ని చెప్పామ‌ని.. కానీ, ప్ర‌భుత్వం నుంచి స‌రైన స్పంద‌న‌లేద‌న్నారు. దీంతో.. ప్ర‌భుత్వం, జూడాల చ‌ర్చ‌ల్లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న‌ట్టు అయ్యింది.