Site icon NTV Telugu

Jubilee Hills By Election Polling: షేక్ పేట్ లో లాఠీ ఝళిపించిన పోలీసులు

Laticharge

Laticharge

Jubilee Hills By Election Polling: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతున్నప్పటికీ… నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా షేక్‌పేట డివిజన్ లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్… శాంతియుతంగా జరుగుతుందనుకుంటే, షేక్‌పేట డివిజన్ లో సీన్ మారిపోయింది.. అక్కడ పోలింగ్ బూత్‌లు 4, 5, 6, 7, 8 వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వాళ్లు హడావిడి చేయడంతో… పోలీసులు వెళ్ళిపోవాలని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు..

VuOn™ AI ప్రాసెసర్, 88W ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్ ఉన్న Vu 43 inches Vibe Series 4K QLED Smart Google TVపై భారీ డిస్కౌంట్..!

కానీ, గులాబీ కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో… పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పలువురు కార్యకర్తలను బూత్ ఏరియాస్ నుంచి చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఉద్రిక్తత వెనుక నాన్-లోకల్స్ ఇష్యూ ఉంది.. ఎన్నికల నిబంధనల ప్రకారం… నాన్-లోకల్స్ నియోజకవర్గంలో తిరగకూడదు. అయినప్పటికీ, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, నాయకులు బూత్‌ల వద్దకు వచ్చి హడావిడి చేస్తూ… ఓటర్లను ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

దీనిపై ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరగడంతో… పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేయాల్సి వచ్చింది. ఒకవైపు ఓటింగ్ పర్సంటేజ్ మందకొడిగా సాగుతుంటే… మరోవైపు బస్తీలలో ఓటర్లను డబ్బులతో ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, డబ్బులు అందకపోవడం వల్ల కూడా ఓటర్లు ఓటింగ్‌కు రావట్లేదని ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. ఈ మొత్తం వాతావరణంలో… షేక్‌పేటలో లాఠీఛార్జ్ అనేది ఉప ఎన్నిక టెంపరేచర్ ని పెంచింది..

Pakistan: పాకిస్తాన్‌లో అసిమ్ మునీర్ సైనిక తిరుగుబాటు.. సైన్యం లేకుండానే పని కానిచ్చేశాడు..

Exit mobile version