Site icon NTV Telugu

Jubilee Hills Bypoll Counting : రేపే కౌంటింగ్.. ఏర్పాట్లు ఇలా..!

Jubilee Hills By Election L

Jubilee Hills By Election L

Jubilee Hills Bypoll Counting : రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్‌ కోసం యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠకు తెరపడనుంది.

రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కోసం యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా ఎన్నికల సంఘం అధికారులు పూర్తి చేయడంతో పాటు కౌంటింగ్ సెంటర్‌లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. కేంద్ర బలగాలతో పాటు మూడంచేలా పోలీసులతో పటిష్ట సెక్యూరిటీని ఏర్పాటు చేసారు. కేవలం అనుమతి పొందిన వారు మినహా ఎవ్వరికి కౌంటింగ్ హాల్లోకి అనుమతి కి లేదని తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్..

Best Broadband Plan: ఎయిర్‌టెల్ vs జియో vs బిఎస్‌ఎన్‌ఎల్.. ఏ కంపెనీ చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కలిగి ఉందంటే?

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల లెక్కింపు లో మొదటగా పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా పోలైన ఓట్లను లెక్కించి., అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓట్ల లెక్కింపు కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు 10 రౌండ్స్ లో మొత్తం 407 పోలింగ్ బూత్ లకి సంబందించిన ఈవీఎం ల ఓట్ల లెక్కింపును పూర్తి చేసేలా ఏర్పాటు చేశారు. ఇక ప్రతి రౌండ్ తర్వాత ట్రెండ్స్‌పై ఆసక్తి నెలకొననుంది.

కౌంటింగ్ హాల్‌లో ప్రత్యేకంగా ప్రతీ టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మైక్రో అబ్సర్వర్ అధికారులు కూడా కౌంటింగ్ ను పర్యవేక్షించునున్నారు. మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ లో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఎవరి తరఫున నిలుస్తుందో రేపటి ఫలితాలతో తేలనుంది. గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠ కు తెరపడనుంది.

Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?

Exit mobile version