Site icon NTV Telugu

JPS Strike: రెగ్యులరైజ్ చేయాల్సిందే.. ప్రభుత్వానికే అల్టిమేటం ఇస్తున్నాం..

Jps Strike Adilabad

Jps Strike Adilabad

JPS Strike: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 12 రోజుల నుండి జూనియర్ పంచాయతీ కార్యదర్శిల శాంతియుత నిరువధిక సమ్మె కొనసాగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 5 గంటల వరకు విధుల్లో చేరకపోతే విధుల నుండి తొలగిస్తామని నోటీసులు జారీ చేయడంతో ఉద్యోగస్తులు స్పందించారు. ప్రభుత్వం కే మేము అల్టిమేటం ఇస్తున్నామని, 5 గంటల వరకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదిలాబాద్‌ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెగ్యులరైజ్ చేస్తామనే ప్రకటన చేయాలని, లేదంటే చర్చలకు పిలిచి హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లక్ష్యం నెరవేరే వరకు తమ పోరాటం మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు. టర్మినెట్ చేస్తే ఆ పత్రాలు తీసుకోమని అన్నారు. న్యాయ పోరాటం చేస్తామని, విధుల్లో చేరేది లేదని స్పష్టం చేశారు.

తమను వీధిలోకి తీసుకునేటప్పుడు ప్రభుత్వము జారీ చేసిన జీవో ప్రకారం మూడు సంవత్సరాలు ప్రొబిషన్ పీరియడ్ అని తెలిపారు. మూడు సంవత్సరాల తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్ తెలిపారని గుర్తు చేశారు. మూడు సంవత్సరాల టైం కరోనా కాలంలోనే అయిపోయినా కూడా ప్రభుత్వ పరిస్థితులను బట్టి మేము ఎలాంటి నిరసన తెలుపలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మరొక సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్ గా ప్రభుత్వము జీవో జారీ చేయడం ఉద్యోగస్తుల మోసం చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో చేరేటప్పుడు మాకు ఇచ్చిన జీవోలో ఎలాంటి కాంట్రాక్ట్ అని లేదని మండిపడ్డారు. దానిలో ఉన్న జీవ ప్రకారమే మా హక్కులను అడుగుతున్నామని స్పష్టం చేశారు. మేం సంఘాలను పెట్టామని ప్రభుత్వం అంటుంటే మాకు ఎలాంటి సంఘాలు లేవని ప్రతి ఒక్కరు మాకు ఉద్యోగ భద్రత కావాలంటూ నిరసన తెలుపుతున్నానని తెలిపారు. ఈరోజు 5 గంటల వరకు మాకు విధించిన డెడ్లైన్ లకు భయపడే ప్రసక్తే లేదు మా సమ్మెను యధావిధాగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వము మమ్ముల భయభ్రాంతులకు గురి చేసిన కూడా మా ఉద్యోగ భద్రత విషయంలో వెనుక తగ్గే ప్రత్యక్ష లేదంటూ సమ్మె యదా విధంగా కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేశారు.
TS Inter Results 2023: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌ల‌దే హవా..

Exit mobile version