NTV Telugu Site icon

JP Nadda: నగరానికి నడ్డా.. నాగర్ కర్నూల్‌లో భారీ సభ

Jp Nadda

Jp Nadda

JP Nadda visit to Telangana: జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ హైక మాండ్ పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాల తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పెద్దఎత్తున జన సమీకరణకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. నడ్డా మినిట్ టు మినిట్ ప్రతిపాదన షెడ్యూల్ ఖరారైంది. నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. ఇవాల మధ్యాహ్నం 12:45 గంటలకు నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

Read also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా మధ్యాహ్నం 1:15 నుండి 2:30 గంటల వరకు నడ్డా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశమవుతారు.నడ్డా మధ్యాహ్నం 3:00 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. నడ్డా సాయంత్రం 4:00 గంటల వరకు నోవాటెల్ హోటల్‌లో ఉంటారు.సాయంత్రం 4:15 గంటలకు నడ్డా హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి నాగర్ కర్నూల్ సభకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 4:45 గంటలకు నాగర్ కర్నూల్ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నాగర్ కర్నూల్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభకు నడ్డా హాజరుకానున్నారు. జాతీయ అధ్యక్షుడు నాగర్ కర్నూల్ నుంచి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరుతారు. నడ్డా సాయంత్రం 6:40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. నడ్డా రాత్రి 7:40 గంటలకు విమానాశ్రయం నుంచి తిరువనంతపురం వెళ్లనున్నారు.
CheteshwarPujara: ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన చతేశ్వర్‌ పూజారా

Show comments