Site icon NTV Telugu

J. P. Nadda: నేడు రాష్ట్రానికి జేపీ నడ్డా.. మహబూబాబాద్ లో బీజేపీ జనసభ

Jp Nadda

Jp Nadda

J. P. Nadda: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ప్రచారానికి బీజేపీ రంగం సిద్దంచేసింది. వరుస పర్యటనలతో ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. తెలంగాణలో రెండంకెల సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగుతుంది. ఇవాళ కొత్తగూడెం, మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనసభ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్ జనసభ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సమావేశాల అనంతరం సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్‌ శాసనసభ నియోజకవర్గం నిజాంపేటలో రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాత్రి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

Read also: PM Modi: రెండ్రోజులు.. ఆరు ర్యాలీలు.. నేడు మహారాష్ట్రలో మోడీ భారీ ఎన్నికల ప్రచారం

మరోవైపు ఈ నెల 30న సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం వెండి గ్రామంలో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతేకాకుండా వచ్చే నెల 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భువనగిరి, నల్గొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ జరిగే మరో సభలో మోదీ పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం వికారాబాద్‌లో మోదీ ప్రసంగిస్తారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మే 1న. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గౌలిపురాలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో ఈ రోడ్ షో కొనసాగనుంది. హైదరాబాద్‌లోని లాల్దర్వాజ అమ్మవారి ఆలయం నుంచి సాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు.
Arvind Kejriwal: నేడు కేజ్రీవాల్ అరెస్ట్పై సుప్రీంకోర్టులో విచారణ..

Exit mobile version