J. P. Nadda: నేడు రాష్ట్రానికి జేపీ నడ్డా.. మహబూబాబాద్ లో బీజేపీ జనసభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
J. P. Nadda: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ప్రచారానికి బీజేపీ రంగం సిద్దంచేసింది. వరుస పర్యటనలతో ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. తెలంగాణలో రెండంకెల సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగుతుంది. ఇవాళ కొత్తగూడెం, మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనసభ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్ జనసభ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సమావేశాల అనంతరం సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నిజాంపేటలో రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాత్రి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
Read also: PM Modi: రెండ్రోజులు.. ఆరు ర్యాలీలు.. నేడు మహారాష్ట్రలో మోడీ భారీ ఎన్నికల ప్రచారం
మరోవైపు ఈ నెల 30న సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం వెండి గ్రామంలో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతేకాకుండా వచ్చే నెల 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భువనగిరి, నల్గొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ జరిగే మరో సభలో మోదీ పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం వికారాబాద్‌లో మోదీ ప్రసంగిస్తారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మే 1న. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గౌలిపురాలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో ఈ రోడ్ షో కొనసాగనుంది. హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయం నుంచి సాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు.
Arvind Kejriwal: నేడు కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో విచారణ..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!