NTV Telugu Site icon

CM KCR: నేడే గద్వాల కలెక్టరేట్‌ ఆఫీస్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Kcr

Kcr

నేడు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్‌ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయం, భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ ఆఫీస్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అనంతరం గద్వాలలోని అయిజ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీంతో సీఎం పర్యటన నేపథ్యంలో గద్వాల్ పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ సాయంత్రం 4:30 కి హెలికాప్టర్ ద్వారా గద్వాల్ చేరుకోనున్నారు.

Read Also : Balayya : ఆ సినిమా విషయంలో తన నిర్ణయం మార్చుకున్న బాలయ్య..?

పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బీఆర్‌ఎస్‌ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లతో పూర్తిగా నిండిపోయాయి. సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ క్రాంతి, ఎస్పీ సృజనతో కలిసి పరిశీలించారు.

Read Also : Telangana: తెలంగాణలో నేటి నుంచి స్కూల్స్ పున: ప్రారంభం

గద్వాల్ జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్డు తెలంగాణ చౌరస్తా సమీపంలో ని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు, వాటి అమలు తీరు, పనుల పురోగతిని ముఖ్యమంత్రి ప్రజలకు వివరించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సభలో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. దీంతో గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ ముగింపు తర్వాత రాత్రి 8 గంటలకు బస్సులో హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ తిరుగుప్రయాణం అవుతారు.

Show comments