Site icon NTV Telugu

Jeevan Reddy: మేము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉంది..

Jeevan Reddy

Jeevan Reddy

Jeevan Reddy: మేము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు బయటకీ వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు డైవర్ట్ చేసే పనిలో పడ్డారన్నారు. పైసా పెట్టుబడి లేకుండా విద్యుత్ అందించే ప్రక్రియ కేంద్రం చేస్తే.. దాన్ని కాదని… కేసీఆర్ యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టారన్నారు. మూడు రూపాయలకు యూనిట్ వచ్చే కరెంట్ వదిలి.. 6 రూపాయలకు కొంటారా..? అని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తి కోసమే పవర్ ప్లాంట్ అని మండిపడ్డారు. నామినేషన్ మీద యాదాద్రి పనులు ఎందుకు అప్పగించారు? అని అడిగారు.

Read also: Fastest Century: 27 బంతుల్లోనే సెంచరీ.. క్రిస్ గేల్ ‘ఆల్‌టైమ్’ రికార్డు బ్రేక్‌!

టెండర్ ప్రక్రియ ఎందుకు పిలవలేదన్నారు. హరీష్ రావు.. అవినీతి చర్చ పక్కదారి పట్టించే పనిలో ఉన్నారన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అవినీతి… కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుందన్నారు. హరీష్ విజ్ఞతతో మాట్లాడని మండిపడ్డారు. పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారు మీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు వల్లనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అని మండిపడ్డారు. ఆర్థిక శాఖ లూటీ చేసింది నువ్వే కదా? అంటూ హరీష్ రావుపై మండిపడ్డారు. నువ్వు లూటీ చేసి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారో చేయండి అన్నట్టు ఉంది హరీష్ వ్యవహారం అని నిప్పులు చెరిగారు. ఆర్థిక స్థితి గతులు చక్కబెట్టే పనిలో ఉన్నారు సీఎం అన్నారు. మేము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉందని క్లారిటీ ఇచ్చారు.
Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌కు బెదిరింపు కాల్స్‌.. రాజీనామా చేయాలని వార్నింగ్..!

Exit mobile version