NTV Telugu Site icon

JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు వచ్చేశాయ్..

Jee Result

Jee Result

JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ ఇవాళ ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు.

Read also: Manipur : మణిపూర్‌లో పోలీసు పోస్టులు, 70ఇళ్లకు నిప్పు పెట్టిన మిలిటెంట్లు

JEE అడ్వాన్స్‌డ్ – 2024 ఫలితాలను తనిఖీ ఇలా..

* ఫలితాల కోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. – https://jeeadv.ac.in/

* హోమ్‌పేజీలో JEE (అడ్వాన్స్‌డ్) 2024 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

* ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీలో విద్యార్థులు తమ రూల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేయాలి.

* జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2024 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

* ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒక ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉంచండి.

Read also: pune porsche car crash: యువకుడి కుటుంబానికి చెందిన లగ్జరీ అపార్టుమెంట్లు ధ్వంసం

ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. దాదాపు 40 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండు సెషన్లలో కలిపి 14.10 లక్షల మంది జేఈఈ మెయిన్‌కు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో కటాఫ్ మార్కులతో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హులవుతారు. అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది నమోదు చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది నమోదు చేసుకున్నారు.

Read also: Manipur : మణిపూర్‌లో పోలీసు పోస్టులు, 70ఇళ్లకు నిప్పు పెట్టిన మిలిటెంట్లు

ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించగా, 40,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో అర్హత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 25న ప్రకటించనుండగా, జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు మే 7 వరకు గడువు ఉంది. ఐఐటీ మద్రాస్ మే 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్షను నిర్వహించింది. మే 31న జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్‌లను ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Amravathi: జగన్‌ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేసిన దుండగులు..