NTV Telugu Site icon

Kaleshwaram: కంపులో కాళేశ్వరం గోదావరి తీరం.. దుర్గంధంతో భక్తులు ఇబ్బందులు..

Kaleshdwaram

Kaleshdwaram

Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం కంపు కొడుతుంది. వ్యర్థాలు,భక్తుల‌ దుస్తులు,కుండలతో దర్శనమిస్తూ దుర్గంధంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కావడంతో కాళేశ్వరానికి తెలంగాణ, ఏపి, మహరాష్ట్ర చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండే ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించెందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయాన్ని దర్శించేముందు త్రివేణి సంగమమైన గోదావరి నదిలో పుణ్యస్నానాలు అచరించడం ఆనవాయితి. దీంతో పున్యస్నానాలకు వెళ్ళే భక్తులకు గోదావరి తీరంలో దుర్గంధం స్వాగతం పలుకుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read also: D.K Aruna: కాలేజీ అమ్మాయిల స్కూటీ లు ఎటు పాయే.. సీఎం రేవంత్ ట్వీట్ పై డీకే అరుణ ఫైర్..

త్రివేణి సంగమం తీరం వద్ద కొందరు తిండి పదార్థాలు, వ్యర్థాలు, దుస్తులు, చెత్త, అస్థికల కుండలు, వేసి కలుషితం చేస్తున్నారు. ప్లాస్టిక్ నియంత్రణ లేకపోవడంతో గోదావరి నది కంపుకొడుతుంది. దీంతో భక్తులు పుణ్యస్నానాలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటివల రాష్ట్ర దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ కాళేశ్వరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గోదావరి తీరం అపరిశుభ్రంగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ చూపి నిత్యం తీరం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే సూచనలను పెడదారి పెట్టాయి. శుభ్రం చేసే నాధుడు కరువయ్యాడు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు, ఆలయ అధికారులు స్పందించి గోదావరి తీరంలో వ్యర్ధాలను తొలగించి, పరిశుభ్రంగా ఉంచాలాని పలువురు భక్తులు కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోదావరి వద్ద దుర్గంధంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
V.C. Sajjanar: క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్ ఘటన.. సజ్జనార్ ట్వీట్ తో పది మందిపై కేసు..

Show comments