NTV Telugu Site icon

Jayashankar Bhupalpalle: డీజే టిల్లు పాటకు పోలీసుల స్టెప్పులు.. ఎస్పీ డ్యాన్స్ పై విమర్శలు..

Bhupala Palli Police

Bhupala Palli Police

Jayashankar Bhupalpalle: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దీంతో ఈ సక్సెస్ మీట్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఎన్నికల అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు అతిథి గృహంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని జిల్లా ఎస్పీ కిరణ్ కరే, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గీతాలాపనలో వారు తిలకించారు. డీజే పాటకు భూపాలపల్లి ఎస్పీతోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది స్టెప్పులు వేశారు. నిత్యం కంటి మీద కునుకు లేకుండా గడిపే పోలీసులు ఆటపాటలతో అలరించారు. పూర్తి ఉత్సాహంతో ఆనందించారు.

Read also: Wife Kidnapped: ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకున్న తిరిగి ఇవ్వడంలేదని భార్య కిడ్నాప్‌.. ఎక్కడంటే..

విజయవంతమైన సమావేశాన్ని జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ కిరణ్ కరే సిబ్బందితో కలిసి డీజే టిల్లు పాటలకు డాన్స్ చేశారు. జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లాకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ ఐలతో కలిసి డీజే పాటలతో ఎస్పీ సంబరాలు చేసుకున్నారు. ఈ జిల్లాలో ఛత్తీస్‌గఢ్ మరియు మహారాష్ట్రతో మావోయిస్టు ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ముగియడంతో జిల్లా పోలీసులు సక్సెస్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. జిల్లా ఎస్సీ కిరణ్ కరే వారితో సరదాగా ఆటల్లో మునిగిపోయారు.

అయితే భూపాలపల్లి ఎస్పీ డ్యాన్స్ పైనా విమర్శలు వెల్లువెత్తాయి. భూపాలపల్లి జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసిందా అనే విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధన ను జిల్లా ఎస్పీ ఉల్లంఘించరంటున్న రాజకీయ పక్షాలు మండిపడుతున్నారు. 144 సెక్షన్ అమ్మలో ఉండగా డీజే సౌండ్ పెట్టి డాన్స్ లు చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో.. ఇది నిర్లక్షం అని సీనియర్లు అంటున్నారు.
School Timings Change: బడి గంట సమయం మారిందోచ్.. ఇకపై 9 గంటలకే స్కూల్‌..