Jayashankar Bhupalpally: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ గ్రామం జలమయమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో మోరంచపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో భవనాలు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమను కాపాడాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మోరంచపల్లి గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Read also: Kadem Project: డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు.. పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల జిల్లాలు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచేర్యాల, మంచేర్యాల, జగిత్యాల, భూరినగర్, నిజాంపాలపల్లి, భూరినగర్, కరయ్యాలపల్లి, పీసీసీడీలకు ఆరెంజ్ అలర్ట్. పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. జూన్ 1 నుంచి బుధవారం వరకు 313.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 416.2 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. సాధారణం కంటే దాదాపు 33 మిల్లీమీటర్లు అధికంగా వర్షపాతం నమోదైందని, వచ్చే వారంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నల్గొండ జిల్లాతో పాటు ఆరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
Muthyam Dhara: జలపాతం వద్ద చిక్కుకొన్న పర్యాటకులు సేఫ్.. కాపాడిన NDRF బృందం