Site icon NTV Telugu

Murder : జనగామలో దారుణం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి భర్తను హత్య

Murder

Murder

Murder : జనగామ జిల్లా పిట్టలోనిగూడెంలో కట్టుకున్న భర్తను ఇద్దరు భార్యలు కడతేర్చారు. తమ తల్లిని హతమార్చడంతో.. కట్టుకున్న భర్తపై పగ తీర్చుకున్నారు. దీంతో పిట్టలోనిగూడెంలో రెండు హత్యలు జరిగాయి. ఈ హత్యలు జనగామ జిల్లాలో సంచలనం సృష్టించాయి. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కాలియా కనకయ్య. ఇతనికి చొక్కమ్మ, గౌరమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిద్దరు సొంత అక్కాచెల్లెళ్లు…

కాలియా కనకయ్య.. సొంత ఊరు జనగామ జిల్లా పిట్టలోని గూడెం. అతడు సొంతూళ్లో జులాయిగా తిరుగుతుంటాడు. ఊరిలో కనిపించిన అందరితో గొడవలు పెట్టుకునే వాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయి ఉంటుంది. ఆమె మామిడి తోటలో ఉండగా.. తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపేశాడు కనకయ్య. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు…

విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటి నుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో పిట్టలోనిగూడెం వచ్చిన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మ.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు.

Kanakadurgamma Temple: ప్లేట్ కలెక్షన్ నిలిపివేత.. ఇంద్రాకిలాద్రిపై పంతుళ్ల లొల్లి!

Exit mobile version