Jagtial Residential in Iraq: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కూలీల దుస్థితి తరచుగా వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇరాక్‌లో చిక్కుకున్న ముగ్గురు తెలంగాణ వాసులను భారత్‌కు తీసుకెళ్లాలని మొరపెట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరన్నపల్లె గ్రామానికి చెందిన పంగ సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండకు చెందిన బట్టు హరీశ్, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఒరికె నడిపి రాజన్న ఐదు నెలలుగా వేతనాలు అందక ఇరాక్‌లో నానా అవస్థలు పడుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. ఎంబసీకి ఎందుకు ఫిర్యాదు చేశారంటూ యాజమాన్యం వారిపై దాడి చేసి.. తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.
Read also: Jangaon Bathukamma: జనగామ బతుకమ్మకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
రెండేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన ఏజెంట్‌కు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు చెల్లించి ఇరాక్‌లోని సమర్ అల్ షకీర్ కంపెనీకి వెళ్లారు. జీతం నెలకు 400 డాలర్లు మాత్రమే ఇస్తున్నాడని వాపోయారు. ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ముగ్గురు కార్మికులు ఉద్యోగాలు వదులుకున్నారని అయినా.. యాజమాన్యం కష్టాలకు గురి చేస్తున్నాడని కన్నీరుపెట్టుకున్నారు. అంతేకాకుండా వారికి ఆహారం ఇవ్వవద్దని కంపెనీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని మొరపెట్టుకున్నారు. పని చేయలేక, తిండిలేక గదుల్లో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. 20 రోజుల క్రితం యజమాని వచ్చి ముగ్గురిపై దాడి చేసి బలవంతంగా పనిలోకి తీసుకెళ్లాడని తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు ఈ నెల 11న సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. కాగా ఇరాక్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులు కష్టాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతం అయ్యారు. సార్ మా వాళ్లను వెంటనే భారత్ కు రప్పించాలని వేడుకున్నారు.
Deputy CM Pawan Kalyan: తిరుమల డిక్లరేషన్‌పై సంతకం చేసిన పవన్ కల్యాణ్.. ఎందుకంటే..?