Site icon NTV Telugu

Jagtial Road Accident: కుటుంబంలో విషాదం నింపిన రిసెప్షన్‌.. వధువు అన్న మృతి..

Jagital Accident

Jagital Accident

Jagtial Road Accident: మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత రిసెప్షన్ జరగాల్సి వుంది. ఈ వేడుకకోసం వధువు కుటుంబం బయలు దేరింది ఇంతలోనే విధి చిన్న చూపుచూసింది. రోడ్డు ప్రమాదంలో వధువు అన్న, తన స్నేహితురాలు మృతి చెందగా.. వధువు తల్లి దండ్రులు కొన ఊపరితో కొట్టమిట్టాడుతున్నారు. ఈఘటన జగిత్యాల -కరీంనగర్ జాతీయ రహదారి ఫై దరూర్ వద్ద చోటుచేసుకుంది.

Read also: Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు

హన్మకొండలోని యువకుడితో కూతురి పెళ్లిని ఘనంగా జరిపించారు తల్లిదండ్రులు. ఇక రిసెప్షన్ వేడుక హనుమకొండలో ఉండటంతో వధువు కుటుంబ సభ్యులు బయలుదేరారు. రిసెప్షన్ వేడుక కూడా హంగులు, ఆర్భాటాలు, నవ్వులు, చిందులు వేస్తూ అందరూ గడిపారు. ఇక ఇంటికి వెళ్లేందుకు వధువు అన్న, తన స్నేహితురాలు, తల్లిదండ్రులు బయలు దేరారు. జగిత్యాల -కరీంనగర్ జాతీయ రహదారి ఫై దరూర్ వద్దకు రాగానే జగిత్యాలకు చెందిన డిపోకి చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో వధువు అన్న సంకీర్త్, స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి,దండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారును ఢీకొట్టిన బస్సు డైవర్ ను అదుపులో తీసుకున్నారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టిసి బస్సు ముందు టైరు ఊడిపోయి ఉండటం పోలీసులు గమనించారు. అయితే.. టైరు ఊడిపోయి ప్రమాదం జరిగిందా? లేక ఢీకొట్టిన సమయంలో టైరు ఓడిపోయిందా? అనే దానిపై డ్రైవర్ తో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కూతురి రిసెప్షన్‌ వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక పక్క నవ వధువు .. మరో పక్క అన్న మృతదేహాం.. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నతల్లిదండ్రులను చూసి కుటుంబ సభ్యులు, రిసెప్షన్ కు వచ్చిన వారందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆసుపత్రి వాతావరణం అంతా కుటుంబ రోదనలతో నిండిపోయింది.
Nara Lokesh: చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి నారా లోకేష్

Exit mobile version