Site icon NTV Telugu

Drunk Man: మద్యం మత్తులో యువకుడి హంగామా .. చిరు వ్యాపారి పై ప్రతాపం

Jagatal

Jagatal

Drunk Man: నడి రోడ్డుపై మద్యం మత్తులో ఓ యువకుడి హంగామా చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హైమద్ అనే యువకుడు ఫుల్‌ గా మద్యం సేవించి రోడ్డుపై వున్న చిరు వ్యాపారులతో గొడవకు దిగాడు. రోడ్డుపై హైమద్ హల్చల్ చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. పీకలదాకా మద్యం సేవించి రోడ్డుపై న్యూసెన్స్ చేస్తుండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ రోడ్డు లోని నటరాజ్ థియేటర్ సమీపంలో గల చిరు వ్యాపారి పై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వారిపై విరిచుకుపడ్డాడు. తోపుడు బండిపై ఉన్న పండ్లను తీసుకుని అన్ని రోడ్డుపై పారబోయడమే కాకుండా.. నానా హంగామా సృష్టించాడు. అక్కడున్న వారందరూ హైమద్‌ ను ఆపడానికి ప్రయత్నించినా వారిపైకూడా అసభ్య పదజాలంతో తిట్ల దండకం మొదలు పెట్టారు. ఈ హంగామా నడిరోడ్డుపై జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మందుబాబును అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Bus Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Exit mobile version