Site icon NTV Telugu

Jeevan Reddy: జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా.. జీవన్ రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీ తొలగింపు

Jeevan Reddy

Jeevan Reddy

జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఫొటో ఉండడంతో స్థానిక కౌన్సిలర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. స్పందించిన అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం తెలియని జీవన్ రెడ్డి అసహనంతో ఉండమంటారా వెళ్లగొడతారా అంటూ మండిపడ్డారు.

Read Also: Team India: భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విస్తార ఎయిర్లైన్స్.. ఏం చేసిందంటే?

జగిత్యాల పట్టణంలోని 8వ వార్డు బేడ బుడగ జంగాల కాలనీలో బోనాల పండుగ సందర్భంగా జీవన్ రెడ్డి ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో విప్ లక్ష్మణ్ కుమార్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫొటోలను ముద్రించారు. కాగా.. ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే.. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు.

Read Also: Sridhar Babu: ఆకస్మిక తనిఖీ.. అధికారులను ఏకిపారేసిన మంత్రి శ్రీధర్ బాబు

Exit mobile version