Site icon NTV Telugu

MLC Jeevan Reddy: జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య..

Mlc Jeevan Reddy

Mlc Jeevan Reddy

MLC Jeevan Reddy: జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు.. ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు వెల్లడించారు. ఇక, గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకి ప్రధాన కారణమని తెలుస్తుంది.

Read Also: Hot Air Balloon in Araku Valley: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్‌..

దీంతో జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందాని అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు. పక్క ప్లాన్ ప్రకారమే గంగారెడ్డిని హత్య చేసినట్టు ఎమ్మెల్సీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మమ్ములను చంపేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ అంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు.

Exit mobile version