Love Marriage: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాం పల్లె వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక.. వెల్గటూర్ మండలం రాజక్క పల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇక, ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో జులై2వ తేదీన వివాహ చేసుకున్నారు.
Read Also: New York Mayor Elections: భారీ విజయం దిశగా డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ
అయితే, రాకేష్ దళితులడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. అలాగే, ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్ లో చూపిస్తామని నమ్మించిన తల్లిదండ్రులు.. హాస్పిటల్ కి చూపించి తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుంది. ఈ విషయంపై తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు తన భర్త రాకేష్ కు ప్రాణహాని ఉందని కంప్లైంట్ లో తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
