NTV Telugu Site icon

Jagga Reddy: అనుభవాలు చాలా నేర్చుకున్న.. సంగారెడ్డి ప్రజలు 5 ఏళ్లు రెస్ట్ ఇచ్చారు..!

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: ఆ ఓటమి నాకు చాలా అనుభవాలు నేర్పిందని, ఈ 10 రోజులోనే ఇంకా చాలా అనుభవాలు నేర్చేసుకున్నానని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బలవంతడు భూమి మీద ఎప్పటికి బలవంతుడిలాగే ఉండడు అన్నారు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడన్నారు. ఎదో ఒక్కరోజు బలహీనుడు కాకతప్పదని తెలిపారు. ఇది ఏ వ్యవస్థలో నైనా వ్యాపారం, రాజకీయం ఇంకా ఏ రంగలోనైనా ఇంతే అన్నారు. అలాగే బలహీనుడు ఎప్పటికి బలహీనుడు గానే ఉండడని తెలిపారు. ఆ బలవంతుండి యొక్క సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడని అన్నారు. ఆ మౌనము బలహీనుడి యొక్క బలహీనత కాదన్నారు. బలహీనుడు కాలం యొక్క సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడని తెలిపారు. కాలము చేసే నిర్ణయంలో బలహీనుడు ఒక్కరోజు బలవంతుడు అవుతాడన్నారు. ఎలాగైతే మనిషి జీవితం యవ్వన్నాము నుండి ముసలితనం వరకు ఎలా ఉంటుందో తెలుసన్నారు.

Read also: Salaar: ఆ నిమిషం 25 సెకండ్స్ ఏముంది నీల్ బ్రో… కాస్త లీక్ చెయ్యొచ్చుగా…

అలాగే ఈ బలవంతుడు.. బలహీనుడి కథ కూడా అంతే..అని తెలిపారు. ఒక నాయకుడి యొక్క గెలుపు ప్రజలను పరిపాలించే సమయమన్నారు. ఒక నాయకుడి యొక్క ఓటమి గతంలో పరిపాలించిన పరిపాలనలో ఉన్న లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి మళ్ళీ సవరించుకొని ప్రయాణం చేసి ముందడుగు వేసే సమయమన్నారు. జగ్గారెడ్డి గా నేను 5 సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసినానని అన్నారు. 3 సార్లు సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే గా.. ప్రతిపక్షగా పార్టీ ఎమ్మెల్యేగా మంచిగా పరిపాలించానని తెలిపారు. మొదటి సారి 2014 లో ఓడిపోయినా.. ఆ ఓటమి నాకు చాలా అనుభవాలు నేర్పిందన్నారు. ఇప్పుడు 2023లో రెండోసారి ఓడిపోయినా అని తెలిపారు. ఈ 10 రోజులోనే ఇంకా చాలా అనుభవాలు నేర్చేసుకున్ననని అన్నారు. ఐతే ఈ సారి మా సంగారెడ్డి ప్రజలకు నాకు 5 ఏళ్లు రెస్ట్ ఇచ్చారని తెలిపారు. అందుకే ఈ సమయాన్ని నేను పూర్తిగా పార్టీ ఆర్గనైజేషన్ కోసం పని చేయాలనీ ఆలోచన చేసుకున్న అన్నారు.

Read also: Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..

సోనియా గాంధీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ అలాగే తెలంగాణ పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన 6 పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు నేను ఎమ్మెల్యేగా లేకపోయినా సంగారెడ్డి ప్రజలకు కూడా ఆ 6 పధకాలు అందుతాయన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారానికి సంబదించిన ఆర్గనైజేషన్ పని ని ఒక తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తి టైమ్ కేటాయించికొని తీరుగాలని నేను ఆలోచన చేసుకుంటున్నానని అన్నారు. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పుడు పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ కి పూర్తి సమయాన్ని ఇవ్వాలని నా యొక్క ఆలోచనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వంలో ఉన్న నాయకత్వానికి, నాయకులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు,రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నానని అన్నారు.
Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..

Show comments