NTV Telugu Site icon

Jaggareddy: ఆలయ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు అవసరం..సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తా..!

Jaggareddy

Jaggareddy

Jaggareddy: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల పండుగ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు దర్శించుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ ఏడుతరాలవారితో చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లష్కర్ బోనాల సమయంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ. 1000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఆ నిధుల కోసం త్వరలో సీఎం కేసీఆర్ కు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని, పాడి రైతులు బాగుండాలని రాష్ట్ర ప్రజలంతా అమ్మను కోరుకున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.

Read also: TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్.. ఏఈ 16వ ర్యాంకర్ నాగరాజు అరెస్ట్

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతా వైభవంగా జరిగింది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టం రంగం కార్యక్రమం ఇవాళ ఉదయం 10 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.‘ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు. గత ఏడాది చేసిన వాగ్దానాన్ని మరిచిపోయారని అన్నారు. మీ అందరికి అవసరమైన బలాన్ని ఇచ్చానని అన్నారు. మీ వెంటే నేను ఉంటాను అన్నారు. వానలు పడతాయి.. మీరు భయపడకండి. ఆలస్యమైనా వర్షాలు కురుస్తాయని.. అగ్ని ప్రామాదాలు జరుగుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఐదు వారాల పాటు నైవేద్యాలు సమర్పించాలని అన్నారు. స్వర్ణలత భవిష్యవాణి మాట్లాడుతూ.. భక్తులు ఏ పూజలు చేసినా ఆనందంగా స్వీకరిస్తానని తెలిపారు. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసని అన్నారు. సంతోషంగా ఎటువంటి లోపం లేకుండా ఆనందంగా పూజలు అందుకున్నానని తెలిపారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, మీతోనే నేను ఉంటానని అన్నారు. నా వద్దకి వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాదన్నారు. 5 వారాలు నాకు సాక పోయండి నాయన అన్నారు. ఏడూ వచ్చేసరికి నాకు తప్పని సరిగా జరిపించండని తెలిపారు. దీంతో రంగం కార్యక్రమం భవిష్యవాణి పూరైంది. ప్రవచనం వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు.
Talasani: ఆటంకం లేకుండా బోనాలు.. సంతోషించిన అమ్మవారు