గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి పాత్ర హట్ టాపిక్‌గా మారింది. ఐదురోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో కొందరూ సీనియర్ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. నిన్న పీఏసీ సమావేశంలో వాడివేడిగా సాగిన చర్చ. అయితే ఈ చర్చలో పరోక్షంగా జగ్గారెడ్డి అంశంపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు సమాచారం. దీంతో జగ్గారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ సత్తా ఏంటో తేల్చుకోవాలని నేరుగా కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్కమ్ ఠాగుర్‌కు సవాల్ విసిరారు జగ్గారెడ్డి.
Read Also: ధర్మయుద్ధం ప్రారంభమైంది.. మెడలు వంచైనా జీవోను సవరిస్తాం: బండి సంజయ్
హుజురాబాద్ కన్నా తక్కువ ఓట్లే వస్తాయన్న జగ్గారెడ్డి. సోషల్ మీడియాలోతనపైన టీఆర్‌ఎస్ పార్టీకి కోవర్టులు అంటూ ఆరోపణలు చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. దీంతో సీనియర్ నేతలు శ్రీధర్‌బాబు, గీతారెడ్డి తదితరులు జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా జగ్గారెడ్డి పార్టీలోతనను అడగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని, పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు.
