NTV Telugu Site icon

Jagga Reddy Letter: నేను ఇక కాంగ్రెస్‌ గుంపులో లేను..

ప్రచారం జరుగుతున్నట్టుగానే టి.పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఆయన.. ఇక, ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్‌ గుంపులో లేను అని పేర్కొన్నారు.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని పేర్కొన్న జగ్గారెడ్డి… త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ లేఖలో రాసుకొచ్చారు..

Read Also: TRS vs BJP : ఘర్షణలో గాయపడ్డ పోలీస్‌..

ఇక, ఉద్దేశ పూర్వకంగా నాపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి.. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉండేదని.. కానీ, అది ఎంతో హుందాగా ఉండేదని.. కానీ, ప్రస్తుతం హుందా తనం లేదని దుయ్యబట్టారు జగ్గారెడ్డి.. సమయం వచ్చినప్పుడు అన్నీ సంక్షిప్తంగా చెబుతానని వెల్లడించారు.. కౌరవ.. పాండవుల యుద్ధం కంటే ముందు అర్జునుడు, భీముడికి బాణాలతో నమస్కారం చేశారు.. అంత మాత్రాన.. ఇద్దరు కోవర్టులు కాదు కదా..? అని ప్రశ్నించారు.. కాంగ్రెస్ నుండి చాలా మంది బయటకు వెళ్లారని జోస్యం చెప్పిన ఆయన.. సడెన్‌గా వచ్చి లాబియింగ్ చేసుకుని పీసీసీ కావొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. సొంత పార్టీ నాయకులే కోవర్టు అని ప్రచారం చేయడం.. దాన్ని ఖండించే పరిస్థితి కూడా పార్టీలో లేదని మండిపడ్డారు జగ్గారెడ్డి.. నా తల్లి పెంపకం నలుగురికి మేలు చేసే తత్వం నేర్పిందన్న ఆయన.. నేను అప్పులు అడుగుతా తప్పితే.. చందాలు కూడా అడగను అన్నారు.. ఇక్కడ ఉండి కోవర్ట్ అని అనిపించుకోవడం ఎందుకు నాకు..? అని ప్రశ్నించిన ఆయన.. తప్పులు సరిదిద్దుకోండి అంటే… కోవర్టు అని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, కాంగ్రెస్ పార్టీలో హేమా హామీలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.. పార్టీ పరువు కోసం.. పోటీ చేయించిన నేను కోవర్టునా? అని నిలదీశారు జగ్గారెడ్డి.. పార్టీ పరువు కాపాడిన నేను కోవర్టా..? హుజూరాబాద్‌లో పార్టీ పరువు తీసిన వాళ్లు కోవర్టా..? అని ప్రశ్నించారు.