NTV Telugu Site icon

Jagga Reddy: పార్టీలో చేరాలంటే వారిని సంప్రదించాల్సిందే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: పార్టీలో చేరాలనుకునే వారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అనుమతితోనే చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధిష్టానం ఆదేశాలతో.. రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు చేపట్టామన్నారు. చేరికలు పెద్దఎత్తున జరిగాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఘర్ వాపసి అయ్యారని తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా చాలా మందిని పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఇక నుంచి చేరికలు నేరుగా జరగవన్నారు. పార్టీలో చేరాలనుకునే వారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అనుమతితోనే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీలో చేరాలనుకునే వారు దీపాదాస్ మున్షి ని సంప్రదించాలని క్లారిటీ ఇచ్చారు.

Read also: Kolikapudi Srinivasa Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లు ఏప్రిల్ 25,26 వ తేదీన గాంధీ భవన్‌ కు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ చేరికల కమిటీ సూచించిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేశారు. ఏ కారణం చేత అయిన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలో చేరి పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఏఐసీసీ ఆదేశించారు. పార్టీలో చేరే వారు బేషరతుగా పార్టీ లోకి ఆహ్వానించాలని, పార్టీ జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు పెద్ద మనసు చేసుకొని వారిని ఆహ్వానించాలని ఏఐసీసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచనలు చేసింది.
BJP MP K. Laxman: రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారు..