NTV Telugu Site icon

Jagadesh Reddy: ఆస్తుల ఆరోపణలపై చర్చకు సిద్ధం.. కోమటిరెడ్డి బ్రదర్స్ కు జగదీష్ రెడ్డి సవాల్

Jagadesh Reddy

Jagadesh Reddy

Jagadesh Reddy: నా ఆస్తులపై చేస్తున్న ఆరోపణనలపై బహిరంగ చర్చకు నేను సిద్ధమని కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్నారు. ఆధిపత్య పోరులో భాగంగానే బీఆర్ఎస్, కేసిఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అషిస్సులకోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరాటపడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ను విమర్శించే స్థాయి కోమటిరెడ్డి బ్రదర్స్ కూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వెనుకబాటుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కారణమని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన విమర్శలు… కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకోసం, రాష్ట్ర అభివద్ధి కోసం నేను జైల్ కు వెళ్ళడానికి సిద్దమన్నారు. ప్రజల సొమ్ము తిన్న కేసులో ఏనాటికైనా జైల్ కు వెళ్ళేది కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే అన్నారు. నా ఆస్తులపై చేస్తున్న ఆరోపణనలపై బహిరంగ చర్చకు నేను సిద్ధమని తెలిపారు.

Read also: West Bengal : పశ్చిమ బెంగాల్‌లో రామ నవమి సందర్భంగా హింస.. ఎన్ఐఏ దర్యాప్తుకు డిమాండ్

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. అద్దె ఇంట్లో ఉంటున్న జగదీష్ రెడ్డి పదేళ్లలో వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. భువనగిరి కాంగ్రెస్ పార్టీ అడ్డా అని అన్నారు. జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుంటే రోడ్డుపై తిరగనివ్వమని హెచ్చరించారు.
Nominations in Telugu States LIVE UPDATES: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం.. లైవ్ అప్‌డేట్స్‌