IT Raids: హైదరాబాద్ లో ఐటీ రైడ్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: హైదరాబాద్ లో మరోసారి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ నాయకురాలు పారిజాత, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం నుంచి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. బాలాపూర్‌లోని పారిజాత నివాసంలో ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఆమెకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. బడంగ్‌పేట మేయర్‌గా పారిజాత ఉన్నారు. పారిజాత కూతురు ఫోన్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో లేరు. పారిజాతకు సంబంధించిన ఇళ్లు, కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ నివాసం ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కేఎస్ఆర్ కు సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులుపెట్టిన కేఎల్ ఆర్. కేఎల్ఆర్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు. దీంతో హైదరాబాద్ లోని రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీరిద్దరితో పాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారి. ఈ సమయంలో వాహనాల్లో తరలిస్తున్న డబ్బులను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. అయితే ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ నాయకుల ఇళ్లలో తనిఖీలు జరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Salary Hike in India: గుడ్ న్యూస్.. న్యూ ఇయర్లో భారీగా జీతాల పెంపు
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు