D. Sridhar Babu: ఉసింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం.. ఐటీ మంత్రి హామీ
D. Sridhar Babu: సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పెద్ధపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ3 ఏరియా పరిధిలోని ఒసిపి 2 బొగ్గు ఉపరితలగని గేట్ మీటింగ్ లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్కమ్ టాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు.సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గడ్డం వంశీకృష్ణ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. యువకుడు పారిశ్రామికవేత్త అయిన వంశీకృష్ణ మన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని వంశీకృష్ణకు మద్దతు తెలిపాలని మంత్రి శ్రీధర్ బాబు కార్మికులను కోరారు.
Read also: Ponguleti: కరెంటుని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకున్నావు.. కేసీఆర్ పై పొంగులేటి ఫైర్
Also Read
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
అనంతరం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రామగిరిఖిల్లా సమీపంలో ఉపాధిహామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఎంపి అభ్యర్థి వంశీకృష్ణతో కలసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రామగిరి ఖిల్లాను పెద్ద పర్యాటక కేంద్రంగా చేస్తామని, ఎన్నికల కోడ్ రాకముందే ప్రతిపాదనలు పంపామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పనిదినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి దఫాలో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఏమైనా సమస్యల ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.
PM Modi: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోంది
తాజావార్తలు
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో