Etala Rajender: బీఆర్‌ఎస్‌ను దించేది బీజేపీ నే అని, ఇప్పటికే ఆలస్యం జరిగిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు కేంద్ర పార్టీ సహకారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ను దించేది బీజేపీ నే అని అన్నారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఈటల పేర్కొన్నారు. కొన్ని మీడియాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఎప్పుడు ఒకటి కాదని తెలిపారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయి కర ఒప్పందం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం లోకి వచ్చేది బీజేపీ, ఇక్కడ ఎగిరేది కాషాయ జండా అని ఈటల రాజేందర్ తెలిపారు. ఈటెల, బండి మాట్లాడుతున్నప్పుడు సీఎం, సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో సంచలనంగా మారింది.
Read also: Kishan Reddy: గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ జాతీయ రహదారులకు కృషి చేశామన్నారు. కేంద్రం ఇటీవల రాష్ట్రానికి రైల్వే తయారీ యూనిట్‌ను కేటాయించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంటీఎస్ కూడా కేటాయించామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులు బాగుపడ్డాయన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోడీ ప్రధాని కాకముందు తెలంగాణకు 2,500 కి.మీ ఉంటే ఇప్పుడు 5 వేల కి.మీలకు చేరుకుందన్నారు. 150 ఎకరాల్లో రైలు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 7 వ్యాగన్ల ఉత్పత్తి సామర్థ్యానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ. 500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.