గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. 2016, ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు నయీమ్.. ఇక, నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకినట్టు కూడా వార్తలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది.. నయీమ్ బినామీ ఆస్తులను జప్తు చేయాలని ఐటీశాఖ నిర్ణయించింది.. ఆస్తులను సీజ్ చేసింది ఐటీ శాఖ.. మొత్తం 45 ఆస్తులు ఉన్నట్టు గతంలోనే ఐటీ శాఖ గుర్తించగా.. అందులో పది ఆస్తులను ఇప్పుడు సీజ్ చేశారు.. ఈ పది ఆస్తులు విలువ సుమారు 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఆస్తులు సీజ్ విషయంపై నయీమ్ భార్యకు నోటీసులు ఇచ్చారు ఐటీ శాఖ అధికారులు. నయీమ్ ఎన్‌కౌంటర్.. పోలీసుల సోదాలు, ఐటీ దాడుల తర్వాత చోటు చేసుకున్న ఈ పరిణామం ఇప్పుడు కీలకంగా మారింది.
Read Also: Nara Lokesh: కబ్జాల నుండి విశాఖని రక్షించుకుందాం.. మీకు అండగా ఉంటాం..
