Site icon NTV Telugu

Vamsiram Builders: వంశీరాం బిల్డర్స్ లో హవాలా లావాదేవీలపై IT శాఖ ఆరా

Vamsi

Vamsi

వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపార ప్రముఖులపై ఐటీ శాఖ పంజా విసురుతోంది. తాజా వంశీరాం బిల్డర్స్ వ్యవహారాలపై ఆరా తీస్తోంది ఐటీ శాఖ. వంశీరాం బిల్డర్స్ లో కొనసాగుతున్న సోదాల్లో అనేక కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వంశీరాం బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో భారీగా ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. రెండు సూట్ కేస్ లో డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తీసుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి కొనసాగిన సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.

Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పై ట్రోల్స్ షురూ.. ?

వంశీ రాం బిల్డర్స్ సంస్థ పలువురు ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందాలు చేసుకున్న పత్రాలను సాధనపరచుకుంది ఐటీ శాఖ. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పెద్ద మొత్తంలో పత్రాలను, అక్రమాలను గుర్తించింది ఐటీ. ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాలు కలకలం రేపుతున్నాయి. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కంపెనీ ఉద్యోగుల పేర్ల మీద భారీగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఐటీ అధికారులు గుర్తించారు. ఉద్యోగుల ఖాతాల నుంచి భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది ఐటీ. పలు కంపెనీలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను స్వాధీనపరచుకుంది ఐటీ. ఫ్లాట్ కొనుగోలుదారుల నుంచి 50 శాతాన్ని పైగా బ్లాక్ లో డబ్బులు తీసుకున్నట్టుగా గుర్తించింది ఐటీ శాఖ. కంపెనీలో చోటుచేసుకున్న హవాలా ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తుంది ఐటీ. నగరంలో వంశీరాం బిల్డర్స్ భారీగా నిర్మాణాలు చేస్తోంది.

Read Also: Telangana Best in India: దేశంలో తెలంగాణ అత్యుత్తమం. ‘హైసియా-ఈఎస్‌జీ సస్టెయినబిలిటీ మీట్‌’లో జయేష్‌ రంజన్‌

Exit mobile version