NTV Telugu Site icon

Malla Reddy Press Meet : ఐటీ దాడులు తెలంగాణ చరిత్ర.. మెంటల్‌ టార్చర్ చేస్తుండ్రు

Mallareddy Press Meet

Mallareddy Press Meet

Minister Malla Reddy Press Meet : వామ్మో.. ఈ ఐటీ దాడులు తెలంగాణలో ఒక చరిత్ర అని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రెండు సార్లు ఐటి దాడులు జరిగినప్పుడు నేను డబ్బులు కట్టినా మరి మూడో సారి ఇలా హడావుడి ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఐటీ అధికారలపై మండిపడ్డారు. మోడికల్‌సీట్లలో డొనేషన్లు తీసుకోలేదు అన్నారు. కేంద్ర బలగాలతో మాపై దాడులు చేశారని ఆరోపించారు. నేను లాప్‌టాప్‌లు ఏమీ గుంజుకోలే.. నేను అధికారులకు నాచేత్తోనే ఇచ్చినా అని స్పష్టం చేశారు. నాకు ముందుగానే కేసీఆర్‌ ముందుగానే చెప్పిండు అని తెలిపారు. మమ్మల్నేకాదు కేసీఆర్‌ను కూడా ఏమీ చేయలేరని తెలిపారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదన్నారు. 19 రాష్ట్రాలున్న బీజేపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, వున్నారు మరి అక్కడ ఎందుకు రైడ్‌ ఎందుకు చేయట్లేదు అంటూ ఫైర్‌ అయ్యారు. బీజేపీలో వుంటే రైడ్స్‌ లేవు ఏమీ లేవంటూ నిప్పులు చెరిగారు మంత్రి మల్లారెడ్డి. బీజేపీ పార్టీలో కాకుండా వేరే పార్టీలో వుంటే రోజూ ఇదే అంటూ మీడియా ముందు రెండు చేతులెత్తి నమస్కరించారు మంత్రి. అంత మెంటల్‌ టార్చర్ చేస్తుండ్రని తెలిపారు. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తారు. మెడికల్‌ సీట్లు అడ్నిషన్లలో అక్రమాలు అంటున్నారు.

read also: China Iphone : ఐఫోన్ కంపెనీలో ఆందోళన.. పొట్టపొట్టుగా కొట్టుకున్నరు

ఏదైనా ఉంటే ఆదేవుడు చూసుకుంటాడు. మీ కేసీఆర్‌ చూసుకుంటారు అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఏదీ ఏం జరిగినా మా కేసీఆర్‌ వున్నంత వరకు నేను ఆయనే వెంటనే వుంటా అంటూ స్పష్టం చేశారు మల్లారెడ్డి. 6లక్షలు ఉంటే అవి అన్నీ ఇడిసిపెట్టి పోయారని అన్నారు. బంగారం నా భార్య పేరు మీద ఉన్నాయి అవి ఇడిసిపెట్టి పోయారన్నారు. వారు ఒక పెద్ద ప్లాన్‌ తో వచ్చారని. కనీసం 100ల కోట్ల ప్లాన్‌ తో వచ్చారని మీడియాతో చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. మావద్ద 1000 మంది పిల్లలు ఉంటారు కానీ, వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకొచ్చారు. వచ్చిన పైసలు రోజంతా ఆన్‌ లైన్‌ లోనే పడితాయి.. ఆన్‌ లైన్లోలే ఖర్చు అవుతాయని తెలిపారు. అది తక్కువ లెక్కకాదు పెద్ద సంస్థ అని కొనియాడారు. అన్ని కోట్లు ఉంటే ఈ ఇంట్లో ఎందుకు ఉంటాను అని ప్రశ్నించారు. నిన్న కాలేజీల వద్ద కూడా హై డ్రామా చేసారని తెలిపారు. కొడుకు, కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచిపెట్టలేదని మండిపడ్డారు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు.

Read alsoL Harsh Kumar: కాంగ్రెస్‌ పార్టీ కీలక పదవి.. తిరస్కరించిన హర్షకుమార్‌..

నేను కొట్లు దొరకలేదని అంటల్లేదు.. ఎవరి వద్ద ఎన్నెన్ని కోట్లు ఉన్నాయో అన్నింటి వద్ద డబ్బులు దొరికినాయి అంటూ తెలిపారు మంత్రి. మా ముగ్గురి వద్ద నుంచి 28 లక్షలు దొరికినాయి. మహేందర్‌ రెడ్డికి కాస్త మంచిగానే వుంది ఆరోగ్యం పర్యవాలేదని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. రెస్ట్ తీసుకోండని నేనే చెప్పినానని అన్నారు. క్లర్క్‌ ఇల్లలో కూడా సోదాలు చేసి మళ్లీ ఆఫీసులకు తీసుకువచ్చారని తెలిపారు. మాకు తెలియని పేర్లు, అడ్రస్‌లు ఐటీ అధికారులు వెతుక్కుని వచ్చారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఒక్క క్షణంలో దుమ్ము దులిపేసారని కాసే మీడియా మిత్రలకు కడుపుబ్బా నవ్వించారు మల్లారెడ్డి. నేను సెల్‌ ఫోన్‌ గోనసంచిలో మడిచి వెనక పడేసాను అని చెప్పారు. నేనొక మినిస్టర్‌ నా కంత అవసరం లేదు అంటూ తెలిపారు. నాకు రేడ్‌ ఏమీ కొత్తకాదు. నాకు మూడో సారి రేడ్‌ జరగడం అన్నారు. ఆరేడ్‌ కూడా హాట్రిక్‌ రేడ్‌ అంటూ మల్లారెడ్డి తెలిపారు.

Show comments