NTV Telugu Site icon

Liquor Josh: వామ్మో ఏంటి మూడు రోజుల్లో అంత తాగారా..!

Drinkers

Drinkers

Liquor Josh: తెలంగాణలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా.. ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం అనూహ్యంగా పెరుగుతోంది. నవంబర్ 2022 మొదటి 20 రోజుల్లో మద్యం అమ్మకాలు రూ. 1260 కోట్లు చేశారు. అప్పట్లో ఆ మొత్తాన్ని విక్రయించడం పెద్ద విషయమని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. అలాంటిది ఇప్పుడు తొలి 20 రోజుల్లో రూ. 1470 కోట్లు. అంటే తాజా అమ్మకాలు రికార్డుగా మారాయి. నవంబర్ మొదటి 20 రోజుల్లోనే రూ. 1470 కోట్ల మద్యం అమ్మితే అంతకు ముందు ఎంత అమ్ముతారు? నవంబర్ మొదటి 20 రోజుల్లో విక్రయించే మద్యం ఒక ఎత్తయితే, మిగిలిన పది రోజులు అంటే 20-30 తేదీల్లో మరో గరిష్టం కానుంది. ఓవరాల్ గా నవంబర్ నెల మద్యం అమ్మకాలలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Read also: AP,TS Weather: తుఫానుగా మారనున్న వాయుగుండం.. ఏపీకి, తెలంగాణలో వర్షాలు

విచిత్రం ఏంటంటే.. ఓ వైపు మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోతుంటే మరోవైపు దాడులు, సోదాల్లో పోలీసులు వందల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహింరు. ఇందులో డబ్బు, బంగారం, వెండితోపాటు పలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల మద్యం పట్టుబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రూ. 105 కోట్ల విలువైన మద్యం పట్టుబడిందంటే ఎంత మొత్తంలో మద్యం తరలిపోయిందో అంచనా వేయవచ్చు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ముందుజాగ్రత్తగా అభ్యర్థులు వందల కోట్ల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేసి ఎక్కడికక్కడ నిల్వ చేసుకున్నారు. విక్రయించే మద్యంలో బీర్ల విక్రయాలు భారీగా ఉన్నాయి. గత నవంబర్‌లో మొదటి 20 రోజుల్లో 12.5 లక్షల కార్టన్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. తొలి 20 రోజుల్లోనే 22 కోట్ల కార్టన్‌ల బీర్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్నిబట్టి మద్యం విక్రయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Cyclone Michaung: ముంచుకొస్తున్న ‘మిచౌంగ్‌’ తుఫాన్‌.. అధికారుల హెచ్చరికలు

Show comments