హుజురాబాద్ ఎలక్షన్స్ దగ్గర పడతున్న కొద్ది ప్రచారంలో నేతల మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతుంది. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేర్ రెడ్డి బీజేపీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ధరలు తగ్గించడం చేతకాక నిందలు కేసీఆర్ పై వేస్తున్నారన్నారు. పెరిగినా పెట్రోల్, డీజీల్ ధరలకు బాధ్యత కేసీఆర్‌దే అని చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలన్నారు. మోడీకీ పరిపాలనా చేతకాదు అని కిషన్‌రెడ్డి ఒప్పుకున్నట్టేనా అని ఎద్దేవా చేశారు. ధరలు తగ్గిస్తామని బీజేపీ అధికారంలోకి వచ్చిందని కానీ, నేడు ధరలను అమాంతం పెంచుతుందన్నారు.
మన్మోహన్ సింగ్ చేసిన చట్టం మార్చడానికి ఇబ్బందేముందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలపై పార్టీ స్టడీ చేస్తుందని, నిబంధనలకు లోబడి సభ పెట్టాలా..? రోడ్‌షో పెట్టాలా అనే చర్చ జరుగుతుందని సాయంత్రం వరకు దీనిపై క్లారీటీ వస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.