Google Map: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభించారు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని నిబంధన ఉండడంతో పరీక్షా కేంద్రాల నుంచి కొందరు విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది.. ముందే ఎగ్జామ్ సెంటర్ చూసుకోవాలి.. గంట ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. విద్యార్థులు చేసిన చిన్న తప్పిదాలే.. వారిని ఎగ్జామ్‌కు దూరం చేస్తున్నాయి.. ఇక, ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి ఏకంగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరాడు.. కానీ, అది మరో లొకేష్ చూపించడంతో.. అసలు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునే సరికి అరగంట ఆసల్యం అయ్యింది.. ఈ సారికి ఎగ్జామ్ రాసే పరిస్థితి లేకుండా పోయింది.
Read Also: TSPSC : పేపర్ లీకేజీ వ్యవహారంపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
గూగుల్ మ్యాప్‌తో ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరిన విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని పరీక్షా కేంద్రానికి చేరుకోవాలనుకున్నాడు ఓ ఇంటర్ విద్యార్థి.. తాను చేరుకోవాల్సిన సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో అక్కడికి చేరుకున్నాడు.. తీరా అది కాదని తెలిసిన తర్వాత.. అసలు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. 27 నిమిషాల ఆలస్యం అయ్యింది.. దీంతో.. ఎగ్జామ్ సెంటర్‌లోకి సదరు విద్యార్థిని అనుమతించలేదు సిబ్బంది.. ఖమ్మంలోని ఎన్ఎస్ పి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామం చెందిన వినయ్ అనే ఇంటర్ ఆ విద్యార్థి.. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని పరీక్షా కేంద్రానికి బయల్దేరడంతో ఈ పరిస్థితి వచ్చింది.. ఇక, చేసేదేమీ లేక విద్యార్థి తిరిగి వెళ్లిపోయాడు.. గూగుల్ మ్యాప్ ఉంది కదా? అని బయల్దేరితే ఎలాంటి పరిణామాలే ఎదురవుతాయి.. ముందుగా ఎగ్జామ్ సెంటర్ చూసుకోవాలని.. ఎగ్జామ్ సెంటర్‌కు ముందుగానే చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తు్న్నారు. కాగా, గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ఎంతో మంది గమ్యస్థానానికి చేరుకోవచ్చు.. కానీ, కొన్ని ఘటనలు విషాదాన్ని కూడా మిగిల్చిన విషయం విదితమే.