Site icon NTV Telugu

ONUS Hospital: వైద్యం వికటించి ఇంటర్‌ విద్యార్థి మృతి.. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

Onus

Onus

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి చౌరస్తాలో (ONUS హాస్పిటల్) ఓనస్ ఆసుపత్రిలో వైద్యం వికటించి హనుమోను పల్లి గ్రామం మాడుగుల మండలంకు చెందిన ఇంటర్ విద్యార్థి రోహిత్ రెడ్డి మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. మృతుడికి డెంగీ వ్యాధి రావడంతో.. కుటుంబ సభ్యులు రోహిత్‌ ను ఈ నెల 1న ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. నిన్న రాత్రి రోహిత్‌ ఆరోగ్యం క్షీణించడంతో.. రాత్రి ప్లేట్ లేట్ ఎక్కించారు ఆసుపత్రి సిబ్బంది. నిన్నటి నుంచి రోహిత్‌ ఆరోగ్యం సీరియస్‌ గా వుందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

Read also: Himachal Pradesh polls: 34వ సారి ఓటు వేశాడు.. అతని వయసు తెలిస్తే షాకే..

అయితే ఉదయం రోహిత్‌ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేశంతో నిన్నటి వరకు రోహిత్‌ ఆరోగ్యం బాగుందని ప్లేట్‌ లేట్ ఎక్కించడం వలనే వైద్యం వికటించి చనిపోయాడని ఆరోపించారు. దీంతో ఆసుపత్రి ముందు రోహిత్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని, ఆసుపత్రి వర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రోహిత్‌ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రోహిత్‌ కుటుంబ సభ్యులను సముదాయిస్తున్నారు. అయితే రోహిత్‌ మృతికి కారణమైన వైద్యులను వెంటనే శిక్షించాలని బాదిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Minister Venugopal: అయ్యన్న అలాచేస్తే.. చూస్తూ ఊరుకోవాలా?

Exit mobile version