Site icon NTV Telugu

Telangana : టీచర్లకు అలర్ట్.. ఇంటర్ లోకల్ క్యాడర్ డిప్యుటేషన్లకు దరఖాస్తులు..!

Ts Gov Logo

Ts Gov Logo

Telangana : రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఇంటర్ లోకల్ క్యాడర్ తాత్కాలిక డిప్యుటేషన్లు, బదిలీల కోసం అర్హులైన టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బంది నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రకారం సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన ఉద్యోగులు అక్టోబర్ 17 నుండి 24 వరకు schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

PM Modi AP Tour: ఏపీ పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్.. రేపు నేను ఏపీలో ఉంటా..

రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ సంయుక్త విద్యా సంచాలకులు (RJD), జిల్లా విద్యా అధికారులు (DEO) తమ పరిధిలోని టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి ఈ ఆదేశాలను తెలియజేసి, దరఖాస్తు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని విద్యా శాఖ సూచించింది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు ప్రతిని సంబంధిత RJD లేదా DEO కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ద్వారా టీచర్లకు ఇంటర్ లోకల్ క్యాడర్ తాత్కాలిక బదిలీలు సులభతరం కానున్నాయి. సాంకేతిక సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నంబర్ +91 8523030307 ను సంప్రదించవచ్చని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…

Exit mobile version