తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్‌లకు గడువు ముగిసింది. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్‌లు రికార్డు స్థాయిలో దాఖలయ్యాయి. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా అడ్మిషన్‌లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తం లక్షా 55 వేల 408 సీట్లు ఉంటే లక్షా 10 వేల 686 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. లక్ష దాటడం కూడా ఇదే మొదటి సారి అని వెల్లడించారు.
Read Also: హైదరాబాద్‌లో తాగుబోతుల వీరంగం.. ఒకేరోజు నలుగురు బలి
అన్ని కాలేజీల్లో(ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్) కలిపి ఇంటర్ మొదటి సంవత్సరంలో సుమారు 5 లక్షల అడ్మిషన్లు వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో ఇంటర్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బందికి 96 శాతానికి పైగా వాక్సినేషన్ పూర్తి చేశామని అధికారులు వెల్లడించారు. ఇంటర్‌లో 18 ఏళ్లకు పైబడిన విద్యార్థులకు వాక్సినేషన్ ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్‌లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు 55 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు.
