Site icon NTV Telugu

Police Alert: PFI కార్యకర్తల దాడులపై పోలీస్ శాఖ అలర్ట్

Pfi

Pfi

Police Alert: PFI కార్యకర్తల దాడులపై తెలంగాణా ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై PFI దాడులు చేసేందుకు కుట్ర చేస్తోందని, PFI, దాని అనుబంధ సంస్ధలపై నిఘా ఉంచాలని హెచ్బరికలు జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలకు విఘాతం జరగకుండా ఉండేలా ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో RSS , విశ్వ హిందూ పరిషత్, హిందు ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేశారు.

Read also: Global Hunger Index: ఆకలి సూచీలో అట్టడుగున భారత్‌.. మనకన్నా పాక్‌, నేపాల్‌లే బెటర్..

దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తొయిబా, ఆల్‌ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని పీఎఫ్‌ఐ సంస్థపై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకలాపాలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐ ప్రచారానికి డిజిటల్ మాధ్యమం ద్వారా పాల్పడుతుందనే ఆలోచనల దృష్ట్యా.. దానికి సంబంధించిన అన్ని వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలను కేంద్రం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎఫ్ఐ అధికారిక ఖాతాలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు తొలగించాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌ పేజీ, ఇన్‌స్టా ప్రొఫైల్‌ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. ట్విటర్‌లో పీఎఫ్‌ఐ సంస్థ ఖాతాకు దాదాపు దాదాపు 81,000 మంది అనుచరులు ఉన్నారు.
Rishabh pant Urvashi Rautela controvery live: ఊర్వశికి పంత్ టార్చర్

Exit mobile version