Osmania Hospital: ఉస్మానియా వద్ద జూడాలు వినూత్న నిరసన చేపట్టారు. ఉపకార వేతనం కోసం జూడాలు చేస్తున్న నిరసన నాలుగో రోజుకు చేరుకుంది.
ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఉస్మానియా హాస్పిటల్ లో కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. నిన్న నల్ల దుస్తులతో జూనియర్ డాక్టర్లు విధులకు హాజరయ్యారు. ఉపకార వేతనాలు సకాలంలో అందించాలని కోరారు. ఉస్మానియా కొత్త బిల్డింగ్ కట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల పై దాడులను ఆపాలని కోరారు. కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు సరిగ్గా నిర్మాణం జరగాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్స్ తో 24 వ తేదీన తాత్కాలిక సేవలను బహిష్కరిస్తూ జూడాలు సమ్మెకు దిగనున్నారు.
Read also: Babar Azam-PCB: ఆ క్రికెటర్‌పై లీగల్ యాక్షన్‌కు సిద్దమైన బాబర్ అజామ్!
సకాలంలో ఉపకార వేతనాల విడుదల చేయాలని తెలిపారు. కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల నిర్మాణం, వైద్యులకు కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం చేపట్టాలని కోరారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు సవరించిన గౌరవ వేతనం నోటిఫికేషన్, వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా సమస్యల పరిష్కారం, తగిన మౌలిక సదుపాయాల కల్పనకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణానికి, యూజీ ప్రాస్పెక్టస్‌కు నీట్‌లో 15% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినందున సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సంబంధిత అధికారుల నుంచి సరైన చర్యలు లేకపోవడంతో సమ్మె తప్ప మరో మార్గం లేదని స్పష్టమవుతోంది. తమ డిమాండ్లన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించకుంటే 24 నుంచి సమ్మెను ప్రారంభించి నిరవధికంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు.
Chandra babu: చీరాల గ్యాంగ్ రేప్ ఘటన.. దర్యాప్తుకు చంద్రబాబు ఆదేశం..(వీడియో)