Site icon NTV Telugu

Indrakaran Reddy: విద్యారంగంలో దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌

Indrakaran Reddy

Indrakaran Reddy

Indrakaran Reddy: నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. మన ఊరు-మన బడి’ పాఠ‌శాల‌, నూత‌నంగా నిర్మించిన రాంన‌గ‌ర్, సోఫిన‌గ‌ర్ పాఠాశాలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి సీయం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురుకులాలు అద్భుతమైన ఫలితాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార‌య‌ని తెలిపారు. విద్యారంగంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా మారుతున్నదని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న విద్యాదినోత్సవం సంద‌ర్భంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో నిర్మల్ ప‌ట్టణంలో నూత‌నంగా నిర్మించిన రాంన‌గ‌ర్, సోఫిన‌గ‌ర్ పాఠాశాలను మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు.

Read also: Karnataka High Court: శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. భర్తపై కేసు కొట్టివేత..

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నదని, తొమ్మిదేళ్ళలో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ పాఠ‌శాలలు, కాలేజీల్లో విద్యా బోధ‌న‌, మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామీణులకు, పేదలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకపక్క ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ.. మరోపక్క సంక్షేమశాఖలవారీగా కొత్తగా గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వివ‌రించారు. అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు రూ. 140 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, రూ. 190 కోట్లతో ఉచితంగా టెక్స్ట్ బుక్స్, సంవత్సరం పొడవునా రూ. 35 కోట్ల ఖర్చుతో రాగి జావా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారని పేర్కొన్నారు. 12 లక్షల 50 వేల మంది విద్యార్థులకు రూ. 56 కోట్ల విలువ గల నోట్ బుక్స్, 34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్స్ 19,800 మంది టీచర్స్‌కు అందించనున్నామ‌ని వెల్లడించారు.
Weight Loss Tips: రాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే బరువు పెరగడం ఖాయం!

Exit mobile version