వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. రాజీనామా పత్రాన్ని కూడా ఇందిరా శోభన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇందిరా శోభన్. ” షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదిరిస్తున్న తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అభిమానులు, తెలంగాణ ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను” అంటూ ప్రకటించారు ఇందిరా శోభన్. కాగా.. కాంగ్రెస్ పార్టీని వీడి… షర్మిల పార్టీలో ఇటీవలే ఇందిరా శోభన్ చేరిన సంగతి తెలిసిందే.
వైఎస్ షర్మిల కు దిమ్మతిరిగే షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా
