Site icon NTV Telugu

Hyderabad: ప్రయాణికుల లగేజీని వదిలేసి వెళ్లిన ఇండిగో ఫ్లైట్..

Indigo

Indigo

IndiGo Leaves Behind 37 Bags Of Passengers At Hyderabad Airport: ఎయిర్ లైన్స్ సంస్థలు అందిస్తున్న సేవల్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఎయిరిండియాలో మూత్ర విసర్జన సంఘటన ఇండియా విమానయాన రంగంలో తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ ఘటనపై ఎయిర్ లైన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీసీసీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిరిండియాకు జరిమానా విధించింది. కాగా, దీని తర్వాత కూడా పలు తప్పిదాలకు జరిగాయి. ప్రయాణికులను వదిలేసి వెళ్లడం వంటి ఘటనలు పలుమార్లు పునరావృతం అయింది.

Read Also: INDvsAUS 1st Test: రోహిత్ సూపర్ సెంచరీ..లీడ్‌లోకి టీమిండియా

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం ప్రయాణికుల లగేజ్ లేకుండానే టేకాఫ్ అయింది. విమానంలో వెళ్లిన ప్రయాణికులకు సంబంధించి 37 బ్యాగులను హైదరాబాద్ విమానాశ్రయంలోనే వదిలిపెట్టింది. ఈ ఘటనపై సదరు ఎయిర్ లైన్స్ సంస్థపై ప్రయాణికులు మండిపడుతున్నారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం బయలుదేరే 6ఈ 409 ఫ్లైట్ 37 లగేజ్ బ్యాగులను అనుకోకుండా వదిలేయబడ్డాయని, విశాఖపట్నంలోని ప్రయాణికుల అడ్రస్ కి బ్యాగులను సురక్షితంగా చేర్చుతామని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఓ ప్రకటనలో ఇండిగో తెలిపింది.

Exit mobile version