NTV Telugu Site icon

Monkey Pox: దేశంలో తొలికేసు.. నేటి నుంచి నగరంలో మంకీ పాక్స్‌ టెస్టులు

Monky Pox

Monky Pox

వర్షాలతో జనం అతలాకుతలం అవుతుంటే.. మరో వైరస్‌ ప్రజలను కలవరపెడుతుంది. ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా కోలుకుంటున్న సమయంలో.. ఈవైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచదేశాల్లోని ప్రజలను కలవరపరస్తున్న మంకీపాక్స్‌ తాజాగా భారత దేశానికి పాకింది. ఈ వార్త విన్న తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. నేటి నుంచి సికింద్రబాద్‌ లోని గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్‌ టెస్టులు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ల్యాబ్‌ లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.

read also: Organ Donation: తను చనిపోయి.. ఐదుగురిని బతికించింది

మంకీపాక్స్‌ శాంపిల్స్‌ లను ఇక్కడ సేకరించి దానిని పుణె ల్యాబ్‌కు పంపనున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే మంకీపాక్స్‌ 50 దేశాలకు పాకింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఈ వైరస్‌ మన దేశంలోను వ్యాపించిన నేపథ్యంలో.. మొదటి మంకీపాక్స్‌ కేసు కేరళలో వెలుగు చూసింది. ఒక వ్యక్తి యూఏఈ నుంచి కేరళకు రావడంతో అతనికి మంకీపాక్స్‌ లక్షణాలు వున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. నేటి నుంచి టెస్టులను కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తోంది.