Independent Candidate: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారవేడి మామూలుగా లేదు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు నేతలు బరిలోకి దిగారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. 10 రోజుల క్రితమే నామినేషన్ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగి తమ నియోజకవర్గంలో నాయకుడికి గట్టి పోటీ ఇచ్చేందుకు కొందరు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అయితే స్వతంత్ర అభ్యర్థి విషయంలో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది.
నిజామాబాద్ అర్బన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన యామగంటి కన్నయ్యగౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన గత రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాయకుడిగా ఎదుగుతాడు అనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళతా ఊహించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నయ్య మృతికి లోన్ యాప్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో తరలించారు. అభ్యర్థిగా నిలిచిన కన్నయ్య ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
రాత్రి వరకు కుటుంబ సభ్యులతో వున్న కన్నయ్య ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి వరకు కన్నయ్య కుటుంబంతో సరదాగా గడిపాడు అయితే మాట్లాడుతూనే తన గదిలోకి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. కాసేపు తరువాత కన్నయ్యకోసం వెళ్లిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. గదిలో కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. అయితే కన్నయ్య వద్ద వున్న ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కన్నయ్య ఆత్మహత్యకు ముందు ఎవరెవరికి కాల్ చేశారనేది దర్యాప్తు చేస్తున్నారు.