Hakimpet OSD Harikrish: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో రాత్రిపూట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. హకీంపెట్ ఓ.ఎస్.డి హరికృష్ణను తక్షణమే సస్పెండ్ వేటు వేసింది. దీనిపై ఓ.ఎస్.డి హరికృష్ణ స్పందించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ స్కూల్ బాలికలు నన్ను డాడీ అని పిలుస్తారని అన్నారు. బాలికలు నా కూతురుతో సమానమన్నారు. ఎలాంటి అధికారి కూడా లైంగిక వేధింపులు పాల్పడలేదని, ఇవన్నీ అవాస్తవమని తెలిపారు. నేను కూడా బాలికల స్కూల్ హాస్టల్ లో షార్ట్ & టి షర్ట్ కూడా వేసుకొను అంత కటినంగా ఉంటానని తెలిపారు. కావాలనే ఇది ఎవరో వెనుక ఉండి చేస్తున్నారని, డర్టీ పాలిటిక్స్ అని మండిపడ్డారు. నేను 3 ఏళ్లుగా స్పోర్ట్స్ స్కూల్ లో స్పెషల్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవని అన్నారు. స్టూడెంట్స్ పేరెంట్స్ మాపై ఎంతో నమ్మకం ఉందని తెలిపారు.
Read also: Viral News: మల్లీశ్వరి సినిమా రిపీట్…ప్రియుడి కోసం కోట్ల ఆస్తి వదిలేసిన ప్రేయసి!
స్పోర్ట్స్ ఆఫీసర్ భోస్, స్పోర్ట్స్ ఆఫీసర్ బోస్, ఫైజియే తెరపి డాక్టర్ రఘు మాట్లాడుతూ.. స్పోర్ట్స్ స్కూల్ చెడ్డపేరు తేవాలని చేయిస్తున్నారని అన్నారు. అసలే అడ్మిషన్స్ టైం తెలిపారు. ఎలాంటి వివరణ లేకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఇలంటి అరోపణలు చేయడం సరికాదన్నారు. మూడు సంవత్సరాలుగా ఫిజియోథెరపీగా చేస్తున్నానని అన్నారు. కేవలం ఆరోపణ మాత్రమే అన్నారు. గర్ల్స్ హాస్టల్ చాలా స్టిట్ గా ఉంటుందన్నారు. పురుషులు ఎవరిని కూడా ఇన్సైడ్ అలో చేయరని మండిపడ్డారు. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ అంటే ఇది రాజకీయంగా కుట్ర అన్నారు. దీని వెనక ఎవరు ఉన్నారనేది వాస్తవం బయటకు రావాలని తెలిపారు.
హకింపెట్ స్పోర్ట్స్ స్కూల్ బాలికలు మాట్లాడుతూ.. స్పోర్ట్స్ స్కూలు లో ఎస్ డి ఓ హరికృష్ణ మాకు తండ్రి లాంటి వారని అన్నారు. ఇప్పటివరకు స్పోర్ట్స్ స్కూల్ లో మాకు ఎలాంటి వేధింపులు ఇబ్బందులు లేవన్నారు. బాలికలని వేధిస్తున్నరాన్న విషయం అవాస్తవమన్నారు. మాకు భద్రత ఉందన్నారు. అన్ని విషయాల్లో స్పోర్ట్స్ స్కూల్ లో సిబ్బంది స్ట్రీట్ గా వ్యవహరిస్తారన్నారు. ఇలా అరిపనలు చేయడం వల్ల మా ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అన్నారు. ఎస్ డి ఓ హరి కృష్ణ వచ్చిన తరువాత అభివృద్ధి జరిగిందన్నారు. మరోవైపు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో చైల్డ్ రైట్స్ అధికారులు చేరుకున్నారు. స్పోర్ట్స్ స్కూల్ బాలిక లైంగిక వేధింపుల ఆరోపణలపై మేడ్చల్ జిల్లా చైల్డ్ రైట్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఓ ఎస్ డి హరికృష్ణను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.