Etela Security: బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటల భద్రతను వై ప్లస్ కేటిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల నుండి తన భర్తకు ప్రాణహాని ఉందంటూ భార్య జమున ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్సీ తన భర్తను చంపడానికి రూ. 20 కోట్ల సుఫారీ ఇచ్చారని ఆరోపించారు. తన భర్తకు ప్రాణ హాని ఉందని మీడియా ముఖంగా బహిరంగంగా ఆరోపించింది. ఈటల భార్య జమున ఆరోపణల అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈటలకు ప్రాణహానీ ఉందంటే తాను నమ్మనని అయినా తెలంగాణలో సుఫారి ఇచ్చి హత్యలు చేయించే సంస్కృతి లేదని చెబుతూనే.. అయినా ఈటలకు అటువంటి ఇబ్బంది ఉందంటే తప్పకుండా ఆయనను రక్షించుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటల భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కేటీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. అనంతరం పోలీస్ ఉన్నతాధికారి ఒకరు రెండు రోజుల క్రితం ఈటల నివాసంకు వెళ్లి పరిస్థితులను పరిశీలించి వచ్చారు. అనంతరం ప్రభుత్వానికి నివేదకను సమర్పించారు.
Read also: Talakona Falls: వాటర్ ఫాల్స్‌లో వీడియో కోసం జంప్.. బండరాళ్ల మధ్య చిక్కుకొని నరకయాతన.. చివరకు..!
ఈటెల భద్రతను పోలీసులు సమీక్షించి నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈటలకు భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈటలకు పెంచిన భద్రత నేపథ్యంలో 11 మంది భద్రతా సిబ్బంది ఆయన వెంట ఉంటారు. ఈ ఉత్తర్వులు శనివారం నుండే అమల్లోకి రానున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వులో స్పష్టం చేసింది. తన భర్తను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ప్రాణానికి హాని ఉందంటూ ఈటల రాజేందర్ భార్య జమున ఆరోపించడంతో భద్రత అంశాన్ని పరిశీలించి భద్రత పెంచుతూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈటల రాజేందర్‌కు వై ప్లస్ కేటగిరీతో 11 మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు.
